అతనో ప్రభుత్వ ఉద్యోగి.. అంతేకాదు కార్యాలయంలో అందరికన్నా ఉన్నతస్థాయి అధికారి..కాని అతని ప్రవర్తన మాత్రం అందరూ అసహ్యించుకునేలా ఉంది. ఇది ఎదో ఒక రోజు జరిగింది కాదు.. ప్రతిరోజూ ఇలాగే జరుగుతోంది.
విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో పనిచేస్తున్న ఎంపీడీఓ జి. చంద్రరావు మద్యం సేవించి తన కార్యాలయంలోనే తోటి ఉద్యోగితో సభ్యసమాజం సిగ్గుపడేలా ప్రవర్తించాడు. ఇలా ప్రతిరోజూ మద్యం సేవించి విధులకు హజరవుతున్నాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. అతని ప్రవర్తనపై విసుగు చెందుతున్నారు. మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని,.. కాసేపయ్యాక తన కుర్చీలోనే పడుకుంటాడని తెలిపారు. గతంలో అతను పని చేసిన కురుపాం ఎంపీడీఓ కార్యాలయంలో కూడా ప్రతిరోజూ మద్యం సేవించి విధులకు హాజరయ్యేవాడని.. ఇప్పటికీ తన తీరు మారలేదని అంటున్నారు.