ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాలూరు చేరుకున్న మధ్యప్రదేశ్​ వలస కూలీలు - Madhya Pradesh Migrant Workers News

ఊరిని కాదనుకుని పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లారు. ఇప్పుడు లాక్​డౌన్​తో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూట తినేందుకు తిండి లేక.. రోజు గడిపేందుకు డబ్బు లేక సతమతమవుతున్నారు. ఈక్రమంలో సొంత రాష్ట్రాలకి వెళ్లేందుకు పయనమయ్యారు. హైదరాబాద్​, విజయవాడలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్న మధ్యప్రదేశ్​కి చెందిన వలసదారులు కాలినడకన స్వరాష్ట్రానికి బయల్దేరారు. మార్గం మధ్యలో ఏవి దొరికితే అవి తినుకుంటూ విజయగనరం జిల్లా సాలూరుకు చేరుకున్నారు.

వలస కూలీలకు పండ్లు, ఆహారం అందిస్తున్న స్థానికులు
వలస కూలీలకు పండ్లు, ఆహారం అందిస్తున్న స్థానికులు

By

Published : May 10, 2020, 9:21 AM IST

దేశ వ్యాప్తంగా లాక్​డౌన్ విధించటంతో ప్రజారవాణా పూర్తిగా నిలిచిపోయింది. అన్ని సంస్థలు, ఫ్యాక్టరీలు మూసేయడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. ఈక్రమంలో స్వస్థలాలకు చేరుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన వలసదారులు హైదరాబాద్​, విజయవాడలో ఉపాధి కోల్పోయారు. చేసేందుకు లేక... ఉన్న ఇళ్లకు అద్దే కట్టలేక ఎలాగైనా తమ స్వస్థలాలకు వెళ్లాలనుకున్నారు. మరో ఆలోచన పెట్టుకోకుండా కాళ్లను నమ్ముకుని ప్రయాణం మొదలుపెట్టారు. అలా నడుస్తూ ప్రస్తుతం విజయనగరం జిల్లా సాలూరు వద్దకు చేరుకున్నారు. అలసిపోయిన వారిని చూసి స్థానిక యవకుడు వారికి పండ్లు పంపిణీ చేశాడు. అనంతరం అక్కడి నుంచి తమ స్వరాష్ట్రానికి వెళ్లేందుకు సాలూరు నుంచి బయల్దేరారు.

ఇదీ చూడండి:రాజుపాలెం జాతీయ రహదారిపై బిహార్​ వలస కూలీల నిరసన

ABOUT THE AUTHOR

...view details