విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. కొవిడ్ ప్రభావం తగ్గినప్పటికీ, వసతి గృహాలు తెరుచుకోకపోవటం.. బస్సుల సౌకర్యం లేకపోవటంతో విద్యార్థులు హాజరుకాలేకపోతున్నారు.
పార్వతీపురం పట్టణం, మండలంలో 40.. పంజాగుట్ట సీతానగరం మండలాల్లో 80 వరకు పాఠశాలలున్నాయి. వసతి గృహాలు తెరుచుకోకపోవటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు... అధిక ఛార్జీలు పెట్టుకొని తరగతులకు హాజరుకాలేకపోతున్నారు.