ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలు నుంచి దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం - విజయనగరం

విజయనగరంజిల్లా నెల్లిమర్ల సమీపంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది.

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

By

Published : Sep 4, 2019, 12:27 PM IST

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
పెద్దలు కాదన్నారో..మరి ఇంకో కారణమో ఓ ప్రేమ జంట ప్రయాణిస్తున్న రైలు నుంచి దూకి ఆత్మహత్యాహయత్నం చేసింది. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం అరసాడకు చెందిన ఓ యువతి, ఇరువాడకు చెందిన నాగరాజు ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు కాదన్నారో, మరి వారిద్దరకు మనస్పర్థలు కారణమో తెలియదు గానీ రైలులో ప్రయాణిస్తున్న వారిద్దరు నెల్లిమర్ల సమీపానికి వచ్చేసరికి ప్రయాణిస్తున్న రైలు నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. రైలు రైల్వే స్టేషన్​ సమీపానికి రావడంతో రైలు వేగం తగ్గటంతో ప్రేమికులిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. రైలు పట్టాల మధ్యలో పడిఉన్న వీరిని గమనించిన ట్రాక్ సిబ్బంది గమనించి 108 వాహనం ద్వారా విజయనగరం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details