ఆత్మహత్య అంటు సెల్ఫీ వీడియో.. అటుపై కనిపించని జంట - lovers committed suicide in Thotapalli barrage
16:28 June 28
ప్రేమజంట
విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజ్‌లో దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలికి చెందిన రాకేశ్, కురుపాంకి చెందిన ఓ మైనర్ బాలిక కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరు తోటపల్లి బ్యారేజ్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ సెల్ఫీ వీడియో పెట్టినట్లు వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు రాకేశ్ బైక్‌తో పాటు మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దర్యాప్తులో భాగంగా గజ ఈతగాళ్లతో నదిలో వెతికించటంతో పాటు.. ఇతర ప్రాంతాల్లో అన్వేషిస్తున్నారు.
ఇదీ చదవండీ..పెళ్లి అనగానే పరారైన యువకుడు..
TAGGED:
విజయనగరం జిల్లా తాజా వార్తలు