తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ - vijayanagaram
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కావాలనే తమపై దాడి చేస్తున్నారంటూ తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
![తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2972217-thumbnail-3x2-giri.jpg)
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్
విజయనగరం కురుపాంలో తన తండ్రి కోసం పోలింగ్ కేంద్రం బయట వేచియున్న విద్యార్థిపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఏ కారణం లేకుండానే తనపై పోలీసులు లాఠీ చేసుకున్నారంటూ విద్యార్థి ఆరోపించాడు. వైకాపా నేతలను ఏమీ అనకుండా ఉద్దేశ్యపూర్వకంగానే తెదేపా కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారంటూ.. ఆందోళనకు దిగారు.