ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారిపై లారీ బోల్తా.. అధ్వాన రోడ్లే కారణం - విజయనగరం జిల్లా గుమడ వద్ద లారీ బోల్తా వార్తలు

విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడ సమీపంలో రహదారిపై లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. రోడ్లు అధ్వానంగా ఉండడంవల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

lorry fell down in gumada vizianagaram district
రహదారిపై లారీ బోల్తా.. అధ్వాన రోడ్లే కారణం!

By

Published : Jul 29, 2020, 11:24 AM IST

విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడ సమీపంలో రహదారిపై లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. రోడ్లు అధ్వానంగా ఉండడంవల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. విశాఖ నుంచి పార్వతీపురం మీదుగా ఒడిశా రాష్ట్రం రాయగడ వెళ్లే రహదారి పలుచోట్లు పాడైపోయింది.

ముఖ్యంగా.. కొమరాడ మండల పరిధిలో రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. ఈ కారణంగా.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలోనూ పలుసార్లు ప్రమాదాలు జరిగాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్లు మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details