విజయనగరం జిల్లా పార్వతీపురంలో కర్రల లోడుతో వస్తున్న లారీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఒడిశా నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ పార్వతీపురం పైవంతెన వద్ద ప్రమాదవశాత్తు పాదచారుల డివైడర్ ఎక్కింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో లారీనీ ఉన్నఫలంగా నిలిపివేశారు. లేనిపక్షంలో 30 అడుగుల లోతులోకి లారీ బోల్తా పడేది. తృటిలో ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కర్రల లోడుతో వస్తున్న లారీకి త్రుటిలో తప్పిన ప్రమాదం - ఈటీవీ భారత్ తాజా వార్తలు
విజయనగరం జిల్లా పార్వతీపురంలో కర్రల లోడుతో వస్తున్న లారీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. పార్వతీపురం పైవంతెన వద్ద లారీ ప్రమాదవశాత్తు పాదచారుల డివైడర్ ఎక్కగా... డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
కర్రల లోడుతో వస్తున్న లారీకి త్రుటిలో తప్పిన ప్రమాదం