ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా..వారిని నిర్ధాక్షిణ్యంగా అణచివేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలో చెరుకు బకాయిలు చెల్లించాలని ఆందోళనకు దిగిన రైతులపై పోలీసులు అమానుషంగా దాడి చేశారని ఆక్షేపించారు.
"ఎన్సీఎస్ షుగర్స్ యాజమాన్యం తమకు రూ.16.33 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆందోళనకు దిగిన రైతుల పట్ల వైకాపా సర్కారు అమానుష దాడిని ఖండిస్తున్నా. సభ్య సమాజం తలదించుకునేలా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. చెరుకు రైతులకు న్యాయంగా రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించి, మహిళలు, రైతులపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి. చెరుకు రైతుల న్యాయపోరాటానికి తెదేపా మద్దతు ఉంటుంది." అని లోకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.