పార్వతీపురం మండలం ఎమ్మార్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. కళ్లెంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. ఈ ఘటనలో ఓ రైతుకు సంబంధించిన ఇరవై బస్తాల ధాన్యం కాలిపోయింది. చుట్టుపక్కల ఉన్న గడ్డివాములకు అగ్గి రాజుకోవటంతో సుమారు పది మంది రైతుల గడ్డికుప్పలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. లక్ష రూపాయల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
కళ్లెంలో అగ్ని ప్రమాదం... ధాన్యంతో పాటు గడ్డివాములు దగ్ధం - fire accident in mr nagar news
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం ఎమ్మార్ నగర్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ రైతుకు చెందిన ధాన్యం, గడ్డివాములు దగ్ధమయ్యాయి.
కాలి బూడిదవుతున్న గడ్డివాములు