విజయనగరం జిల్లా పార్వతీపురంలో మళ్లీ లాక్ డౌన్ ప్రారంభమైంది. కరోనా కేసులు పెరిగిన పరిస్థితుల్లో ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. కలెక్టర్ హరిజవహర్లాల్, ఎస్పీ రాజకుమారి నిర్ణయం మేరకు.. జిల్లాలోని 4 పురపాలక సంఘాల్లో లాక్ డౌన్ అమలు చేసేందుకు నిర్ణయించారు.
ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. పార్వతిపురం పురపాలక సంఘంలో మరోమారు లాక్ డౌన్ అమలులోకి రావటంతో మధ్యాహ్నం రహదారులు నిర్మానుష్యంగా మారాయి.