కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని అధికారులు కఠినమైన చర్యలు చేపడుతున్నారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే ప్రాంతాల్లో.. ప్రజల సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రజలకు నిత్యావసరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని... ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాలకొండ ఆర్డీవో టీవీఎస్ జి. కుమార్ పేర్కొన్నారు. అవసరమైతేనే ప్రజలు రహదారిపైకి రావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలను బయటికు తీసుకురావద్దని సూచించారు.
ఆమదాలవలస పట్టణంలో 10 గంటల తరువాత స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. ఈ మేరకు మార్కెట్ ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోడ్లపైకి వచ్చిన వాహనదారుల్ని తిరిగి పంపించేశారు.