జిల్లాలో ఇప్పటికే కొన్ని చోట్ల లాక్డౌన్ కొనసాగుతుండగా ..ఈ రోజు నుంచి మరికొన్ని ముఖ్య పట్టణాల్లో అమలు చేస్తున్నారు. బొబ్బిలి, సాలూరు, చీపురుపల్లి పట్టణాల్లో నేటి నుంచి వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. చీపురుపల్లిలో ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సమావేశమై లాక్డౌన్ అమలుపై నిర్ణయానికొచ్చారు. బొబ్బిలి, సాలూరులో పోలీసు, రెవిన్యూ, పురపాలక అధికారులు వర్తకులతో సమావేశం నిర్వహించి మధ్యాహ్నం ఒంటిగంటలోపు దుకాణాలను మూసివేయాలని సూచించారు. భోగాపురం పంచాయతీలోనూ నేటి నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కురుపాం, పార్వతీపురం, శృంగవరపుకోటలో ఇప్పటికే లాక్డౌన్ అమలవుతోంది. గజపతినగరంలో స్వచ్ఛందగా దుకాణాలు మూసివేస్తామని వర్తకసంఘం పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. చాలా ప్రాంతాల్లో వ్యాపారులే ముందుకు వచ్చి అధికారులకు సహకరిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జూన్ 30 నుంచి మూడురోజుల పాటు బంద్ పాటించాలని నిర్ణయించారు.
విజయనగరం జిల్లాలో స్వచ్ఛందంగా వ్యాపారుల బంద్
విజయనగరంజిల్లాలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్నందున లాక్డౌన్ అమలుకు వ్యాపార, వర్తక సంఘాల మద్ధతు పెరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసేందుకు వ్యాపారులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో స్వచ్ఛందంగా వ్యాపారుల బంద్