Demolition of Houses in LB Colony and Boggula Dibba: విజయనగరం ఎల్బీ కాలనీ, బొగ్గులదిబ్బలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. ఎల్బీ కాలనీలోని 20 మందికి సారిపల్లి టిడ్కో కాలనీలో ఇళ్లు కేటాయించారు. బొగ్గుల దిబ్బలో 70 కుటుంబాలకు జగనన్న లేఔట్లలో స్థలాలు మంజూరు చేశారు. బొగ్గుల దిబ్బలోని తాత్కాలిక నివాసాలు ఖాళీ చేయాలంటూ నగరపాలక సంస్థ అధికారులు జేసీబీలతో వచ్చారు. ఇళ్ల కూల్చివేత ప్రారంభించటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ముందస్తు సమాచారం లేకుండా ఇళ్లు కూల్చేస్తే ఎక్కడికి పోవాలంటూ స్థానికులు అధికారులను నిలదీశారు. బాధితులకు ప్రజా సంఘాలు, సీపీఎం, తెలుగుదేశం నాయకులు సంఘీభావం తెలిపారు. కూల్చివేతకు అడ్డొచ్చిన స్థానికులు, ప్రజా సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ పార్టీల నేతలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.