ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు' - tdp Vijayanagaram District Leaders Media Conference

మాజీ కేంద్ర మంత్రి, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు విషయంలో వైకాపా నేతలు వ్యక్తిగత కక్షలకు పాల్పడుతున్నారని తెదేపా విజయనగరం జిల్లా నేతలు అన్నారు. ఉద్దేశపూర్వకంగానే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

tdp Vijayanagaram District Leaders
తెదేపా విజయనగరం జిల్లా నేతలు

By

Published : Jul 20, 2021, 7:52 PM IST

మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైకాపా నేతలు వ్యక్తిగతంగా, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని తెదేపా విజయనగరం జిల్లా నేతలు అన్నారు. విజయనగరంలోని అశోక్ బంగ్లాలో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మీడియా సమావేశం నిర్వహించారు. అశోక్ గజపతిరాజుపై వైకాపా నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టారు. మాన్సాస్ ట్రస్టు విషయంలో ట్రస్టు ఏర్పాటు, ఎండోమెంట్ యాక్డ్, భూముల అమ్మకాలు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పై.. వైకాపా నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. నిరాధార, నిరూపితం కాని విషయాలపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ రెండేళ్లలో కోర్టు తీర్పులన్నీ ఆ పార్టీకి వ్యతిరేకంగా రావటం అందుకు నిదర్శనమన్నారు.

ABOUT THE AUTHOR

...view details