ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా నాటు సారా స్వాధీనం... 13 మంది అరెస్ట్ - local lquor seezed at parvathipuram vijayanagaram

విజయనగరం జిల్లా పార్వతీపురంలో 800 ప్యాకెట్ల నాటు సారాను పోలీసులు పట్టుకున్నారు. 13 మందిని అరెస్ట్ చేశారు.

local lquor seezed at parvathipuram vijayanagaram district
నాటుసారా స్వాధీనం చేసుకున్న పోలీసులు

By

Published : Jun 13, 2020, 4:16 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఇన్​ఛార్జి డీఎస్పీ శ్రీనివాస్ రావు, స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ సహాయ అబ్కారీ సూపరింటెండెంట్ శ్రీనాథులు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా కాలనీ, పెద్ద రిల్లి వీధుల్లో తనిఖీలు చేపట్టగా 800 ప్యాకెట్ల నాటుసారాను గుర్తించారు.

వాటిని స్వాధీనం చేసుకుని 13 మందిని అరెస్ట్ చేశారు. ఆయా వీధుల్లోని 21 అనుమానిత ద్విచక్ర వాహనాలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. సారా నియంత్రణకు పక్క ప్రణాళికతో ముందుకు సాగనున్నట్లు చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details