2011 జనగణన ప్రకారం విజయనగరం జిల్లాలో పది వేలు జనాభా దాటిన ఆరు పంచాయతీల్లో చీపురుపల్లి మేజరుపై అందరి దృష్టి పడింది. ఎస్.కోటలో సర్పంచి, ఉపసర్పంచి పదవులకు తీవ్ర పోటీ ఉంది. ఇదే పరిస్థితి కొత్తవలస, కొండపాలెం (గరివిడి)ల్లోనూ నెలకొంది. 10 వేలకు పైగా జనాభా కలిగిన పంచాయతీల ఓటర్లు ఏ పార్టీ మద్దతుదారులకు జై కొడతారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ఏడు వేల నుంచి 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు ఎనిమిది ఉన్నాయి. ఇందులో అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న భోగాపురంపై అందరి దృష్టి పడింది. ఈ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఉపసర్పంచి పదవికీ పోటీ నెలకొంది. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన కురుపాంలోనూ పోరు ఆసక్తికరంగా మారింది. ఇక జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గజపతినగరం, పురిటిపెంట పంచాయతీలు కీలకంగా మారాయి.
ఎనలేని ప్రాధాన్యం