విజయనగరం మండలంలో 22 పంచాయతీల్లో రెండు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 20 పంచాయతీలకు జరిగిన పోరులో 15 వైకాపా మద్ధతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలే తమ పార్టీకి చెందిన 17మంది అభ్యర్ధులను గెలిపించాయని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పార్టీ మద్ధతుతో గెలుపొందిన వారు ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని ఎమ్మెల్యే సూచించారు. నూతన సర్పంచ్ల సత్కార సభ అనంతరం, విజయనగరం 13వ డివిజన్ కొత్తపేటకు చెందిన పలువురిని పార్టీలోకి చేర్చుకున్నారు.
గెలుపొందిన సర్పంచ్‌లకు సన్మానం - విజయనగరం జిల్లా తాజా వార్తలు
విజయనగరం మండలంలో వైకాపా తరపున గెలుపొందిన 17మంది సర్పంచ్‌లను ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సత్కరించారు. విజయనగరంలోని ఆయన నివాసంలో గెలుపొందిన సర్పంచ్‌లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజేతలను శాలువలతో సత్కరించారు.
Ycp_Sarpanchalaku