విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం వెంకంపేట పంచాయతీలో.. సర్పంచ్ పదవికి పోటీ రసవత్తరంగా మారింది. 60ఏళ్లపాటు అన్యోన్యంగా మెలిగిన అన్నదమ్ములు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. గ్రామానికి చెందిన శివనాయుడు, కృష్ణారావు అన్నదమ్ములు. గతంలో గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన శివనాయుడు ఈసారి నామినేషన్ వేశారు. అయితే.. ఆయనపై పోటీగా అధికార పార్టీ మద్దతుతో కృష్ణారావు నిలబడ్డారు. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అన్నదమ్ముల మధ్య పోటీలో విజయం ఎవరిని వరిస్తుందోనని గ్రామస్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రసవత్తరంగా పంచాయతీ ఎన్నికలు.. ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన అన్నదమ్ములు - విజయనగరం జిల్లా తాజా వార్తలు
విజయనగరం జిల్లాలోని వెంకంపేట గ్రామంలో పంచాయతీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రత్యర్థులుగా అన్నదమ్ములు బరిలోకి దిగారు. గ్రామంలో పోటాపోటీగా అన్నదమ్ములు ప్రచారం చేస్తున్నారు.
local body elections