ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

150 నాటు సారా ప్యాకెట్లు స్వాధీనం... ఒకరు అరెస్టు - సాలూరు తాజావార్తలు

విజయనగరం జిల్లాలోని మండపేట, సాలూరుల్లో ఎస్​ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 150 సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని.. ఒకరిని అరెస్టు చేశారు.

liquor seized
సారా స్వాధీనం

By

Published : May 27, 2021, 8:13 AM IST

విజయనగరం జిల్లాలోని మండపేట, సాలూరుల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఎస్​ఈబీ అధికారులు తెలిపారు. దాడులు చేస్తుండగా సాలూరులో జమదల పైడితల్లి అనే మహిళ నివాసంలో ఒక సంచిలో.. 150 నాటు సారా ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మరిపల్లి గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి నుంచి వాటిని కొని.. ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఆమె పోలీసులకు చెప్పగా.. ఇద్దరిపై కేసు నమోదైంది. మహిళను అరెస్టు చేసిన పోలీసులు.. వినోద్​ను సైతం త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. సదరు మహిళను కోర్టు ముందు హాజరుపరుస్తామన్నారు. తనిఖీల్లో సెబ్​ అధికారి సి.హెచ్.బాల నరసింహ, సీఐ రాజశేఖర్​, ఎస్సై జగన్నాథం, కానిస్టేబుల్స్​ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details