స్వచ్ఛంద సంస్థలు ఎక్కువగా సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ కోరారు. పార్వతీపురంలో లయన్స్ క్లబ్ యాభై వసంతాలు సందర్భంగా ఆయన వేడుకలను ఆయన ప్రారంభించారు. సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కొంతమంది వ్యక్తులు కలిసి స్వచ్ఛంద సంస్థలుగా ఏర్పడి సంక్షేమ కార్యక్రమాలు చేపడితే మంచి ఫలితం ఉంటుందన్నారు.
' సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి' - విజయనగరం లయన్స్ క్లబ్ వార్తలు
సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అన్నారు. పార్వతీపురంలో లయన్స్ క్లబ్ యాభై ఏళ్ల వేడుకలకు ఆయన హాజరయ్యారు. ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటి గౌతమి అభిప్రాయపడ్డారు.
దేశానికి వెన్నెముక అయిన రైతులకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటి గౌతమి అన్నారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె.. కళాకారులను అభినందించారు. ప్రపంచమంతా పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయని.. ఈ పరిస్థితుల్లో సామాన్యులు తమ గొంతును వినిపించిన అవకాశం ఉండటం లేదన్నారు. ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు, క్లబ్ అధ్యక్షులు మాధవ్, సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'సకల సౌకర్యాలతో జగనన్న కాలనీల నిర్మాణం'