విజయనగరం జిల్లా సాలూరు గ్రామీణ ప్రాంతాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో విజ్ఞాన గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. రైతులకు వివిధ పంటలు, సాగు పద్ధతులు, సంక్షేమ పథకాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఆసక్తి ఉన్న రైతులు కేంద్రానికి వచ్చి పుస్తకాలను చదువుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతేకాకుండా తగిన షరతులతో... ఇంటికి తీసుకువెళ్ళవచ్చని చెప్పారు.
వ్యవసాయ విజ్ఞాన భాండాగారాలుగా రైతు భరోసా కేంద్రాలు - సాలూరులో రైతు భరోసా కేంద్రాలు
విజయనగరం జిల్లా సాలూరు పరిసర ప్రాంతాల్లోని రైతు భరోసా కేంద్రాలు.. వ్యవసాయ విజ్ఞాన భాండాగారాలుగా నిలవనున్నాయి. ఈ కేంద్రాల్లో అన్నదాతల సౌకర్యార్థం గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు.

విజ్ఞాన భాండాగారాలుగా రైతు భరోసా కేంద్రాలు