మోదీ ప్రభుత్వం కరోనాపై యుద్ధం మానేసి కార్మికులపై యుద్ధం ప్రకటించిందని ఆరోపిస్తూ విజయనగరంలో వామపక్ష నాయకులు విమర్శలు చేశారు. కార్మిక వర్గానికి మేలు చేస్తున్న అనేక చట్టాలను.. ఈ 90 రోజుల కాలంలో కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం మార్చేసిందని ఆరోపించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ అంటూ 20 లక్షల కోట్లు రూపాయలు ప్రకటించి ఎవరికి ఇచ్చారో తెలియజేయాలని వారు ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా జూలై 3వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ కార్యక్రమాలు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా పోస్టర్లను విడుదల చేశారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గి కార్మిక చట్టాల్లో మార్పులను ఉపసంహరించుకోవాలని... అమల్లో ఉన్న కార్మిక చట్టాలనే పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.