లాక్డౌన్ నేపథ్యంలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కోమరాడ మండలం కంచరపాడు గ్రామంలోని గిరిపుత్రులు ఆకులనే మాస్కులుగా పెట్టుకున్నారు. కరోనా నుంచి తప్పించుకునే మార్గంగా.. ఈ విధానాన్ని పాటించారు.
మాస్కులు పెట్టుకున్నారిలా..! - ఏపీలో కరోనా మరణాలు
కరోనా భయం అడవితల్లి నీడలో ప్రశాంత జీవనం సాగించే గిరిపుత్రులనూ వెంటాడుతోంది. విజయనగరం జిల్లా కంచరపాడు గ్రామంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న గిరిజనులకు ఆకులే మాస్కులయ్యాయి.
కంచరపాడులో గిరిజనుల ఆకుల మాస్కులు