ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో సీఎం జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రాథమిక వైద్య కేంద్రం నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే రాజన్నదొరతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ. కోటి 81 లక్షల నిధులు వెచ్చించనున్నట్టు చెప్పారు.
గత ప్రభుత్వం మాటలు చెప్పి మోసం చేసిందని.. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుందని పుష్ప శ్రీవాణి అన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని ఎమ్మెల్యే రాజన్నదొర పేర్కొన్నారు.