బియ్యాలవలసలో డ్రోన్ ప్లయింగ్ ద్వారా భూ సర్వే - జిల్లా సబ్ కలెక్టర్ విధేఖర్ ఆధ్వర్యంలో డ్రోన్ ప్లయింగ్ ద్వారా భూ సర్వే న్యూస్
విజయనగరం జిల్లా కురుపాం మండలం బియ్యాలవలసలో జిల్లా సబ్ కలెక్టర్ విధేఖర్ ఆధ్వర్యంలో డ్రోన్ ప్లయింగ్ ద్వారా భూ సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. దీని ద్వారా రైతులకు రానున్న రోజుల్లో భూమి హక్కు, భూ పరిరక్షణ వివరాలు మరింత సులభతరం అవుతాయని విధేఖర్ పేర్కొన్నారు.
![బియ్యాలవలసలో డ్రోన్ ప్లయింగ్ ద్వారా భూ సర్వే Land survey was carried out by drone play in Vizianagaram District Kurupam Zone Biyyalavalasa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10775199-394-10775199-1614260386444.jpg)
బియ్యాలవలసలో డ్రోన్ ప్లయింగ్ ద్వారా భూ సర్వే
వైఎస్సార్ జగనన్న భూ హక్కు, భూ రక్షణ పథకంలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాం మండలం బియ్యాలవలసలో డ్రోన్ ఫ్లయింగ్ ద్వారా అధికారులు భూ సర్వే చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా సబ్ కలెక్టర్ విధేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ద్వారా రానున్న రోజుల్లో భూమి హక్కు, భూ పరిరక్షణ వివరాలు రైతులకు మరింత సులభతరం అవుతుందని సబ్ కలెక్టర్ అభిప్రాయపడ్డారు. భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు. మొదటి విడతగా మండలంలోని 20 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశామని పేర్కొన్నారు.