ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు జరగాల్సిన గిరిజనులకు అటవీహక్కుల పత్రాలు, డీకేటీ పట్టాల పంపిణీని వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ వెల్లడించింది.
అయితే రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల్లోనూ ఆగస్టు 9న వేడుకలు జరుగుతాయని స్పష్టం చేసింది. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అక్టోబరు 2వ తేదీన నిర్వహించనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ వివరించింది. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏలో జరిగే ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి హాజరుకానున్నారు.