రామభద్రపురం మండలం ఆరికతోట వద్ద ఓ వితంతు మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆరికతోట నుంచి పాతరేగ వెళ్లు రహదారికి ప్రక్కన ఉన్న మామిడితోటలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి ఆసుపత్రికి తరలించారు. విచారణలో ఆమె కామన్నవలసకు చెందిన పెంటమ్మగా గుర్తించారు. ఈమెకు ఇద్దరు కుమారులు.. వారు విశాఖలో నివసిస్తున్నట్లు చెప్పారు. ఆమె భర్త పదేళ్ల క్రితమే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం ఉదయం రామభద్రపురం మండలంలోని పాతరేగకు వెళ్లినట్లు కామన్నవలస గ్రామస్థులు చెప్పారు. సాయంత్రం పెంటమ్మ తన సొంతూరికి తిరుగు పయనమైనట్లు బంధువులు తెలియచేశారు. అయితే మార్గ మధ్యలో మామిడితోటలో ఆమె మృతదేహం ఉండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తలకు బలమైన గాయాలు గుర్తించారు. హత్యగా భావిస్తున్నట్లు సాలూరు సీఐ సింహాద్రి నాయుడు తెలియజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
మామిడి తోటలో అనుమానాస్పదంగా మహిళ మృతి - విజయనగరం జిల్లాలో అనుమానాస్పదంగా మహిళ మృతి
అరికతోట నుంచి పాతరేగ వెళ్లు రహదారి పక్కనున్న మామిడి తోటలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తలపై గాయం గుర్తించి హత్యగా భావిస్తున్నట్లు సాలూరు సీఐ సింహాద్రి నాయుడు తెలిపారు.
![మామిడి తోటలో అనుమానాస్పదంగా మహిళ మృతి lady died in a suspicious way](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9213409-73-9213409-1602943571815.jpg)
అనుమానాస్పదంగా మహిళ మృతి