21సంవత్సరాల యువతి.. బైక్ మీద పోతున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. సరే అతను లిఫ్ట్ ఇచ్చాడు. కొంత దూరం పోయాక తాను దిగే చోటు ఇదేనంటూ యువతి బైక్ ఆపి దిగింది. ఈ క్రమంలో బైక్ నడుపుతున్న వ్యక్తి మెడలో ఉన్న బంగారు చైన్(మూడున్నర తులాలు) గుంజుకొని పారిపోయింది. బాధితుడు అరవగా..అక్కడున్న స్థానికులు పరుగెత్తి..ఆ యువతిని పట్టుకున్నారు. అతని బంగారాన్ని ఇప్పించారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గజపతినగరం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల వివరాల మేరకు..
విజయనగరం వైపు నుంచి బైక్పై గజపతినగరం వస్తున్న పైనాన్స్ వ్యాపారి చింత సత్యనారాయణ రెడ్డిని గొట్లాం సమీపంలో సామంతుల లక్ష్మి (21) బైక్ లిఫ్ట్ అడిగింది . గజపతినగరం బ్రిడ్జి ముందు ఉండే దావాలపేట రోడ్డు సమీపంలో బైక్ ఆపి దిగింది. అదే సమయంలో సత్యనారాయణ రెడ్డి మెడలో మూడున్నర తులాలు చైన్ తెంపుకొని పారిపోయింది. బైక్ యజమాని కేకలు వేయడంతో స్థానికులు, సమీపంలో ఉన్నవారందరూ ఆమెను వెంబండించి పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈమెపై గతంలోనూ చైన్ దొంగతనం కేసు ఉందని పోలీసులు తెలిపారు. లక్ష్మిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు గజపతినగరం సీఐ రమేష్ తెలిపారు.
ఇదీ చదవండి:CHEATING: కటకటాల్లోకి ఘరానా మోసగాళ్లు