సాధారణంగా మహిళలు రేషన్ దుకాణాలు, పింఛన్ల పంపిణీ, ఇతర ప్రదేశాల్లో పురుషులతో పాటు ప్రత్యేకంగా క్యూ కట్టడం చూస్తాం. విజయనగరం జిల్లా జామి మండల కేంద్రం వద్ద ఇందుకు విభిన్నంగా మద్యం దుకాణం వద్ద మహిళలు ప్రత్యేకంగా క్యూ కట్టారు. మద్యం కోసం మహిళలు పురుషులతో సమానంగా గొడుగులు పట్టుకొని ప్రత్యేక వరుస కట్టడం చూసి అందరూ అవాక్కయ్యారు.
మద్యం కొనుగోలుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావటం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే... ఈ తంతు వెనక బెల్టుషాపుల నిర్వాహకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. బెల్టుషాపుల యజమానులుమద్యం బాటిల్ ఒక్కొక్కదానికి రూ.50 చెల్లిస్తుండటంతో మహిళలు మద్యం దుకాణం వద్ద బారులు తీరినట్లు తెలిసింది.