ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంకుల వద్ద భౌతిక దూరం మరచిన మహిళలు

విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లోని మహిళలు బ్యాంకుల వద్ద క్యూలు కట్టారు. ఆగస్టు 15, 16 తేదీలు సెలవులు కావడం వల్ల ప్రభుత్వ పథకాల నుంచి వచ్చే నగదను అందుకునేందుకు, డ్వాక్రా వాయిదాలు కట్టేందుకు లైన్లలో నిలబడ్డారు.

ladies standing at line without social distance at banks in vijayangaram, east godavari districts
విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో బ్యాంకుల వద్ద క్యూలైన్ల పరిస్థితి

By

Published : Aug 14, 2020, 5:45 PM IST

ఈ నెల 15, 16 తేదీల్లో బ్యాంకులకు సెలవుల కారణంగా మహిళలు డ్వాక్రా వాయిదాలు చెల్లించేందుకు, జగనన్న చేయూత నగదు కోసం బ్యాంకుల వద్ద బారులు తీరారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

ఆలమూరు మండలంలో డ్వాక్రా వాయిదాలు కట్టేందుకు మహిళలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. 15, 16 తేదీలు సెలవులు కావడం వల్ల మహిళలు నగదు జమ చేసేందుకు బ్యాంకులకు తరలివచ్చారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించకుండా క్యూలైన్లలో నిలబడ్డారు. అధికారులు స్పందించి మహిళలకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరారు. అలాగే బ్యాంకు అధికారులు ఇటువంటి సమయాల్లో కౌంటర్లు పెంచాలని కోరారు.

విజయనగరం జిల్లాలో..

15, 16 తేదీలు సెలవులు కావడం వల్ల సాలూరు పట్టణంలో మహిళలు బ్యాంకుల వద్ద క్యూలు కట్టారు. జగనన్న చేయూత పథకం ద్వారా అందే డబ్బులను తీసుకునేందుకు ఉదయం 8 గంటల నుంచే పడిగాపులు కాశారు. అధికారులు భౌతిక దూరం పాటించాలంటూ మొరపెట్టుకుంటున్నా... అవేమీ తమకు పట్టనట్టుగా లైన్లలో నిలుచున్నారు.

ఇదీ చదవండి :

చేయూత నగదు కోసం... భౌతిక దూరానికి దూరం!

ABOUT THE AUTHOR

...view details