చిత్తూరు జిల్లా పుంగనూరులో పాత పాఠశాల భవనం పైకప్పు పడి దినసరి కూలీ మృతిచెందాడు. నాడు నేడు పథకంలో భాగంగా నూతన భవనాల నిర్మాణ పనుల నిమిత్తం స్థానిక బసవరాజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పాతభవనాల గోడలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో కిటికి పైకప్పు మీదపడి కూలీ ఆనందకుమార్ (38) మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాల భవనం పైకప్పుపడి కూలీ మృతి - crime news in chittoor dst
పాఠశాల భవనం పైకప్పు మీదపడి కూలీ మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది. విషయం తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
![పాఠశాల భవనం పైకప్పుపడి కూలీ మృతి labour worker died due to damage of building in chittoor dst punganoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7628150-546-7628150-1592227343612.jpg)
labour worker died due to damage of building in chittoor dst punganoor