విజయనగరం జిల్లా బొబ్బిలిలోని లక్ష్మీ శ్రీనివాస జనపనార పరిశ్రమ కార్మికులు ఆందోళన చేపట్టారు. పాత బకాయిలు ఇవ్వడం లేదంటూ ప్రధాన రహదారిపై బైఠాయించి, నినాదాలు చేశారు. మిల్లు మూతపడి ఏళ్లు గడుస్తున్నా పాత బకాయిలు ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ భూములు అమ్మి బకాయిలు చెల్లిస్తామని స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో గతంలో యాజమాన్యం హామీ ఇచ్చింది. ఈనెల 13 నాటికి పూర్తి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా.. యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు.
PROTEST: పాత బకాయిలు చెల్లించాలంటూ కార్మికుల ఆందోళన - vizianagaram district latest protest
విజయనగరం జిల్లా బొబ్బిలిలో జనపనార పరిశ్రమ కార్మికులు ఆందోళన చేపట్టారు. పాత బకాయిలు చెల్లించాలంటూ పరిశ్రమ ఎదుట రహదారిపై బైఠాయించారు.
పాత బకాయిలు చెల్లించాలంటూ కార్మికుల ఆందోళన