విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లో కూలీలు కృష్ణా జిల్లాకు వలస బాట పట్టారు. స్థానికంగా కూలి గిట్టుబాటు కావడం లేదని.. అందుకే దూరప్రాంతాలకు పయనమవుతున్నట్లు కూలీలు చెబుతున్నారు.
విజయనగరం టూ కృష్ణా.. కూలీల వలస బాట
విజయనగరం జిల్లాలో కూలీలు కృష్ణా జిల్లాకు వలస బాట పట్టారు. స్థానికంగా తక్కువ కూలీ వస్తుండడం, గిట్టుబాటు కాకపోవడంతో దూరప్రాంతాలకు పయనమవుతున్నామని చెబుతున్నారు. నెల రోజుల వరకు పని దొరుకుతుందని తర్వాత ఇతర పనులపై దృష్టి సారిస్తామంటున్నారు.
విజయనగరం టూ కృష్ణా.. కూలీల వలస బాట
మినుము చేలు ఎక్కువగా ఉండడంతో వారే స్వయంగా బస్సులు ఏర్పాటు చేసి మరీ కూలీలను తీసుకెళుతున్నారు. దీంతో పార్వతీపురం కూడళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తలకు కలిపి పన్నెండు వందల రూపాయల వరకు ఆదాయం సమకూరుతుందని కూలీలు చెబుతున్నారు. నెల రోజుల వరకు పని ఉంటుందని తర్వాత వేరే పనిపై దృష్టి సారిస్తామని అంటున్నారు.