కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల నుంచి తమను ఆదుకోవాలని.. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ పరిధిలోని ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణికి వినతిపత్రం అందించారు. జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆమెను కలిశారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ లాక్ డౌన్ వలన అవన్నీ వాయిదాపడి తమ జీవనోపాధి దెబ్బతిందని ఫొటోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వ్యాపారాలు పూర్తిగా పడిపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఉప ముఖ్యమంత్రికి వివరించారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పుష్పశ్రీవాణి హామీ ఇచ్చారు.
'ఆర్థిక ఇబ్బందులున్నాయి.. మమ్మల్నీ ఆదుకోండి' - ఉపముఖ్యమంత్రిని కలిసిన వీడియోగ్రాఫర్లు
లాక్ డౌన్ కారణంగా తమ వ్యాపారులు పూర్తిగా పడిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. మిగతా వారిలాగే ప్రభుత్వం తమనూ ఆదుకోవాలని విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఉపముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు.
!['ఆర్థిక ఇబ్బందులున్నాయి.. మమ్మల్నీ ఆదుకోండి' kurupam photo and video graphers meets deputy cm pushpasri vani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6762195-980-6762195-1586683119295.jpg)
పుష్పశ్రీవాణికి వినతిపత్రం అందిస్తున్న ఫొటోగ్రాఫర్లు