విజయనగరం జిల్లా సాలూరు మండలం కొఠియా వివాదాస్పద గ్రామాల్లో వివాదాలకు ఒడిశా ప్రభుత్వం ఆజ్యం పోస్తోంది. కొఠియా గ్రామాల్లో ఈనెల 13న పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించి... సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయినా ఎన్నికలు సజావుగా సాగాయి. ఆ గ్రామాల్లోని వారంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అయితే ఒడిశా ప్రభుత్వం ఆ గ్రామాల్లోని ప్రజలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఉపాధిహామీ పథకం డబ్బులు చెల్లించకుండా బ్యాంక్ ఖాతాలను రద్దు చేసినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం 35 కిలోల చొప్పున బియ్యం, అమ్మ ఒడి, రైతు భరోసా వంటి పథకాలు అందిస్తుందని... ఒడిశా ప్రభుత్వం వల్ల తమకు ఒరిగేదేమి లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనే ఉంటామని చెప్పారు.