ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాముడి విగ్రహం ధ్వంసం.. తల ఎత్తుకెళ్లిన దుండగులు - నెల్లిమర్లలో రాముడి విగ్రహం ధ్వంసం చేసి తల ఎత్తుకెళ్లిన దుండగులు

కోదండ రాముడి దర్శనం కోసం కొండపైకి వెళ్లిన భక్తులకు.. ధ్వంసమైన విగ్రహం కనిపించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో జరిగింది. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. రాముడి తలను తీసుకెళ్లగా.. సీత, లక్ష్మణుల విగ్రహాలు యథాతథంగా ఉన్నాయి.

rama statue destroyed
రాముడి విగ్రహం ధ్వంసం

By

Published : Dec 29, 2020, 7:47 PM IST

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపైనున్న రాముడి విగ్రహాన్ని.. గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కోదండ రాముడి తలను తమతో పాటు తీసుకెళ్లగా.. సీత, లక్ష్మణ విగ్రహాలకు ఎటువంటి హాని చేయలేదు. తల లేని రాముడి విగ్రహాన్ని గమనించిన భక్తులు.. ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ రాజకుమారితో పాటు స్థానిక పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నాయి.

రాముడి విగ్రహం ధ్వంసం

నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు, విజయనగరం ఎంపీ బెల్లన చంద్రశేఖర్​.. ధ్వంసమైన కోదండ రాముడి విగ్రహాన్ని పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. రాముడి అడుగు జాడలున్న ప్రాంతంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. త్వరలోనే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. నిందితుల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details