విజయనగరం జిల్లా గరివిడిలోని ఇందిరమ్మ కాలనీలో ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు గరివిడి పోలీసులు స్థానిక ఇందిరమ్మ కాలనీలో సోదాలు చేపట్టారు. మామిడిపాక వెంకటరత్నం అనే మహిళ వద్ద ఉన్న మూటలను పరిశీలించారు. అందులో సుమారు రూ. 62 వేల విలువ చేసే ఖైనీ, గుట్కా ప్యాకెట్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
గరివిడిలో భారీగా ఖైనీ, గుట్కా పట్టివేత..ఇద్దరు అరెస్ట్ - Vizianagaram district latest news
విజయనగరం జిల్లా గరివిడిలో చేపట్టిన సోదాల్లో భారీగా ఖైనీ, గుట్కాను గరివిడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
![గరివిడిలో భారీగా ఖైనీ, గుట్కా పట్టివేత..ఇద్దరు అరెస్ట్ khaini and gutka seized at garividi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9616075-878-9616075-1605954892458.jpg)
గరివిడిలో భారీగా ఖైనీ, గుట్కా పట్టివేత
గరివిడి నుంచి గర్భం వెళ్లే రోడ్లో చేసిన తనిఖీల్లో.. పొట్ట తవిటి రాజు అనే వ్యక్తి వద్ద గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. వాటి విలువ రూ. 22 వేలు ఉంటుందని పేర్కొన్నారు. రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు గరివిడి పోలీసులు వెల్లడించారు.