కాయకల్ప అవార్డు కింద రెండు లక్షలు మంజూరు అయినట్లు జిల్లా అధికారుల నుంచి సమాచారం అందిందని చినమేరంగి సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ కమల కుమారి తెలిపారు. ఆసుపత్రి లోపల, బయట పరిశుభ్రతంగా ఉంచడం, రికార్డులు నిర్వహణ, రోగుల పట్ల సిబ్బంది పనితీరు ఇలా అన్ని విషయాలపై గతంలో రెండు బృందాలు సర్వే జరిపాయన్నారు. వారు మంచి మార్కులు వేయడం రెండో గ్రేడ్ లభించిందని పేర్కొన్నారు.
కాయకల్ప అవార్డ్కు ఎంపికైన చినమేరంగి - చినమేరంగి సీహెచ్సీ విజయనగరం వార్తలు
కాయకల్ప అవార్డ్ ఎంపికలో విజయనగరం జిల్లాలో రెండవ స్థానం చినమేరంగి సీహెచ్సీకి లభించిందని చినమేరంగి సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ కమల కుమారి తెలిపారు. ఈ అవార్డ్కు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్న ఆమె సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.

కాయకల్ప అవార్డ్కు ఎంపికైన చినమేరంగి