"గోదావరి జలాల అంశంలో ఏపీకి అన్యాయం జరిగితే సహించం" - laxmi
గోదావరి జలాలపై శాసనసభలో జరిగిన చర్చపై కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించేది లేదని చెప్పారు.
గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి న్యాయం జరగకపోతే ఊరుకునేది లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ హరిబాబు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, భాజపా జాతీయ నాయకురాలు పురందేశ్వరితో కలసి విజయనగరంలో పర్యటించారు. గోదావరి జలాలపై శాసనసభలో జరిగిన చర్చపై కన్నా స్పందించారు. రాష్ట్రంలో వైకాపా పాలనపై ఇప్పుడేం మాట్లాడబోమని.. ఆరు నెలలు గడిచిన తర్వాత స్పందిస్తామన్నారు. 2014 ఎన్నిక తర్వాత దేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా ఉన్న భాజపా, ప్రస్తుతం 12 కోట్లమంది సభ్యత్వంతో ప్రపంచంలోనే మేటి పార్టీగా నిలిచిందన్నారు. ప్రస్తుతం మోదీ నాయకత్వాన్ని నమ్మి అన్ని పార్టీల నాయకులు భాజపా వైపు చూస్తూన్నారని తెలిపారు.