ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా కనకమహాలక్ష్మి ఉత్సవాలు - vizayanagaram

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాదిగా తరలిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు.

శ్రీకనక మహాలక్ష్మీ ఉత్సవాలు

By

Published : Mar 10, 2019, 10:02 PM IST

చీపురుపల్లిలో ప్రారంభమైన శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారి ఉత్సవాలు
విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రజల ఇలవేల్పు అయిన శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి 21వ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుక మూడు రోజులపాటు జరగనుంది. మెుదటి రోజు జ్యోతి ప్రజల్వన, కుంకుమపూజ, ప్రభల ఉత్సవం, రెండో రోజు తోళేల్లు కార్యక్రమం, మూడో రోజు ఘటోత్సవాలు, బాణాసంచా కాల్పులు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు పోలీసుల పటిష్ట భద్రత కల్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జబర్దస్త్ బృందంతో నిర్వాహకులు ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details