విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ ఛైర్మన్ ఇప్పిలి గోవింద అమ్మవారికి మొదటి పూజ నిర్వహించి జాతరను ప్రారంభించారు. విజయనగరం ఎంపీ బి.చంద్రశేఖర్ దంపతులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి కానుకల సమర్పించారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్తరాంధ్రలో అతిపెద్ద జాతరగా పిలవబడే ఈ జాతర మంగళవారం వరకు జరగనుంది.
చీపురుపల్లిలో కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ప్రారంభం - mp chandra sekhar latest news update
ఉత్తరాంధ్రలో అతిపెద్ద జాతరగా పిలవబడే.. చీపురుపల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ జాతర మంగళవారం వరకు జరగనుంది.
![చీపురుపల్లిలో కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ప్రారంభం kanakamahalakshmi ammavari jatara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11002737-475-11002737-1615709304883.jpg)
అమ్మవారికి పూజలు చేస్తున్న విజయనగరం ఎంపీ బి.చంద్రశేఖర్ దంపతులు