ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించటం లేదు' - వైకాపా పాలనపై అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలు

వైకాపా పాలనపై తెదేపా సీనియర్ నేత కళా వెంకట్రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా వైకాపా ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరవైందని ఆరోపించారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

kala venkat rao, ashok gajapathi raju fires on cm jagan
kala venkat rao, ashok gajapathi raju fires on cm jagan

By

Published : Dec 3, 2020, 7:47 PM IST

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మచ్చుకైన కనిపించటం లేదని తెదేపా ముఖ్యనేత కళా వెంకట్రావ్ ఆరోపించారు. విజయనగరంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు నివాసంలో.. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా సమావేశం జరిగింది. స్థానిక సంస్థల బలోపేతం, రైతుల సమస్యలపై పోరాటం, నూతన జిల్లాల ప్రతిపాదనపై తెదేపా నేతలు సమీక్షించారు. ప్రభుత్వ తీరుతో పేదలు.. నిరుపేదలుగా మారుతున్నారని కళా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు విమర్శించారు. ఈ సమావేశంలో విజయనగరం తెదేపా నాయకుడు ఐవీపీ రాజుని.. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details