KA Paul: అవినీతి, దొంగ ప్రభుత్వాలను, నాయకులను ప్రజలు నిలదీయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ పిలుపునిచ్చారు. ‘పాల్ రావాలి.. పాలన మారాలి’ పేరిట విజయనగరం నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉందని.. గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్‌పై చర్చించేందుకు నరేంద్ర మోదీ, అమిత్‌షా ఆహ్వానించడంతో అత్యవసరంగా దిల్లీ బయల్దేరి వెళ్తున్నానని చెప్పారు. అందుకే యాత్రను వారం రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
అవినీతి ప్రభుత్వాలను నిలదీయండి: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ - KA Paul news
KA Paul: అవినీతి, దొంగ ప్రభుత్వాలను, నాయకులను ప్రజలు నిలదీయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ పిలుపునిచ్చారు. ‘పాల్ రావాలి.. పాలన మారాలి’ పేరిట విజయనగరం నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉందని.. గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్‌పై చర్చించేందుకు.. మోదీ, అమిత్‌షా ఆహ్వానించడంతో దిల్లీ బయల్దేరి వెళ్తున్నట్లు చెప్పారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరుకుందని, ఇకపై అప్పు ఇచ్చేవారు కూడా లేని దౌర్భాగ్య స్థితికి చేరుకున్నామని విమర్శించారు. తనను రోల్‌మోడల్‌గా తీసుకుంటానని పవన్ కల్యాణ్ చాలాసార్లు అన్నారని, అలాంటప్పుడు తన పార్టీతో ఎందుకు కలవరని పాల్ ప్రశ్నించారు.
ఇవీ చూడండి: