ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూట్ టెక్నాలజీ మిషన్ భవనం ప్రారంభమెప్పుడో..! - vizianagaram-district latest news

విజయనగరం జిల్లా బొబ్బిలిలో జూట్ టెక్నాలజీ మిషన్ భవనం నిరుపయోగంగా ఉంది. పారిశ్రామికవాడలో సుమారు నాలుగేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని ఇప్పటివరకూ ప్రారంభించలేదు. ఈ భవనాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

jute-technology-mission-building-in-bobbili-vizianagaram-district
జూట్ టెక్నాలజీ మిషన్ భవనం

By

Published : Aug 25, 2020, 12:37 AM IST

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రైతులకు.. అధునాతన పద్ధతులపై అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం టెక్నాలజీ మిషన్ పనులు చేపట్టింది. భవనం నిర్మించినప్పటికీ.. అది రైతులకు అందుబాటులోకి రాలేదు. ఈ విషయంపై అధికారులను సంప్రదించగా... సిబ్బంది కొరతతో టెక్నాలజీ సేవలు కష్టంగా ఉందని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా భవనాన్ని ప్రారంభించాలని జనపనార సాగుదారులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details