విజయనగరం జిల్లా సాలూరు జూట్ మిల్లు వద్ద ఐఎఫ్టీయూ నాయకులు, కార్మికులతో కలిసి ధర్నా చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి కార్మికుడికి రూ. 2 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చి 2 షిఫ్టులలో యాజమాన్యం పనిచేయించుకుంటోంది. అలా కాకుండా రూ. 5వేలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
సాలూరు జూట్ మిల్లు వద్ద కార్మికుల ధర్నా - సాలూరులో జూట్ మిల్లు కార్మికుల ఆందోళన
విజయనగరం జిల్లా సాలూరు జూట్ మిల్లు వద్ద ఐఎఫ్టీయూ నాయకులు, కార్మికులతో కలిసి ధర్నా చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని.. అప్పటివరకూ పనిలోకి రామని తేల్చిచెప్పారు.
సాలూరు జూట్ మిల్లు వద్ద కార్మికుల ధర్నా
అంతేకాకుండా షిఫ్ట్‌కి షిఫ్ట్కీ మధ్య గంట విరామం కావాలని కోరారు. మార్చి 23 నుంచి లాక్ డౌన్ ప్రారంభమైనందున ఆ 7 రోజులు కలుపుకుని నెల జీతం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు యాజమాన్యం చర్చలు జరపాలని.. అప్పటివరకూ పనిలోకి వెళ్లమని చెప్పారు.
ఇవీ చదవండి... వేగంగా కదులుతున్న అంపన్