రోటరీ క్లబ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవలు అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తి సీ.హెచ్ మానవేంద్ర నాథ్ రాయ్ అన్నారు. దీనిని విస్తృత పరచి ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. విజయనగరం జిల్లా రోటరీ క్లబ్ వొకేషనల్ మంత్ ఎక్స్ లెన్స్ విశిష్ట అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రోటరీ వొకేషనల్ మంత్ విశిష్ట పురస్కారాన్ని జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్ అందుకున్నారు.
రోటరీ క్లబ్ సంస్థ సేవలు అభినందనీయం: జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్ - జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ కామెంట్స్
రోటరీ క్లబ్ సంస్థ సేవలు అభినందనీయమని జస్టిస్ సీ.హెచ్. మానవేంద్ర నాథ్ రాయ్ అన్నారు. రోటరీ వొకేషనల్ మంత్ విశిష్ట పురస్కారాన్ని స్వీకరించిన ఆయన.. క్లబ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు.
రోటరీ క్లబ్ సంస్థ సేవలు అభినందనీయం
దేశంలో నెలకొన్న రుగ్మతలను నిర్మూలించడానికి ఇటువంటి మంచి ఆర్గనైజేషన్లు ముందుకు వచ్చి సేవలను పెంచాలన్నారు. పార్వతీపురం వెనుకబడిన ప్రాంతమని, గిరిజన ప్రాంత అభివృద్ధికి రోటేరియన్లు సేవలు అందించాలని కోరారు. పిల్లల యాచక వృత్తి నియంత్రించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. పోలీస్, జ్యూడీషియరీలతో కమిటీగా ఏర్పడి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలన్నారు.
ఇదీ చదవండి :
C.P.S విధానం రద్దు చేసేవరకు ఉద్యమిస్తాం : యూటీఎఫ్