వలసకూలీలకు జర్నలిస్టుల సాయం - Journalists helped Migrant laborers news
పసి పిల్లలతో కలిసి తమ స్వగ్రామాలకు వెళుతున్న ఇతర రాష్ట్రాల వలసకూలీలకు విజయనగరం జిల్లాకు చెందిన జర్నలిస్టులు సహాయం చేస్తున్నారు. సామాజిక బాధ్యతగా జిల్లాకు చెందిన జర్నలిస్టులు తమ వేతనాల నుంచి కొంత నగదు సేకరించి కూలీలకు వాహనాలు ఏర్పాటు చేశారు.
వలసకూలీలకు జర్నలిస్టుల సాయం
తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు పసిపిల్లలతో కలిసి కాలి నడకన వెళ్తున్న వలస కూలీలకు తమవంతుగా జిల్లాకు చెందిన జర్నలిస్టులు అంతా కలిసి నగదు సేకరించి వాహనాలను ఏర్పాటు చేశారు. వారికి పౌష్టిక ఆహార పదార్థాలు, ఓఆర్ఎస్, బిస్కేట్లు అందజేశారు.
ఇదీ చదవండి:
'వ్యవసాయ కార్యకలాపాలకు ఇబ్బంది కలగొద్దు'
TAGGED:
lockdown news