ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన ఇంజనీరింగ్ కళాశాల కోసం స్థల పరిశీలన - గిరిజన ఇంజనీరింగ్ కళాశాల విజయనగరం

విజయనగరం జిల్లా కురుపాంలో జేఎన్టీయూ బృందం పర్యటించింది. గిరిజన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలనకు వచ్చారు. ఆచార్యుల బృందం టేకరఖండిలో స్థలాన్ని సందర్శించారు.

jntu team visit
jntu team visit

By

Published : May 19, 2020, 2:36 PM IST

విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగు కళాశాల ఏర్పాటుకు అధికారులు గుర్తించిన స్థలాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆచార్యుల బృందం పరిశీలించారు. ఏడుగురు సభ్యులతో కూడిన బృందం కురుపాం సమీపంలోని టేకరఖండిలో గుర్తించిన స్థలాన్ని సందర్శించారు. ఇప్పటికే గిరిజన సంక్షేమశాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉపముఖ్యమంత్రి పి.పుష్పశ్రీవాణి ఈ స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంచార్జ్ సబ్ కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ స్థలానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఆచార్యుల బృందం నిర్ణయం మేరకు ఇంజినీరింగు కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోనుంది.

ABOUT THE AUTHOR

...view details