NTR photo on silver: విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి చెందిన స్వర్ణ కళాకారుడు జగదీష్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా.. ఆయన సూక్ష్మ చిత్రాన్ని వెండితో చెక్కి తయారు చేశారు. 60 నిముషాల వ్యవధిలో చేతితో వెండిపై చెక్కి ఆకర్శించారు. గ్రాము వెండితో దీనిని తయారు చేసినట్లు తెలిపారు. గతంలో జగదీష్ మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, నరేంద్ర మోదీ, సోనుసూద్, చంద్రబాబు, వైయస్సార్, పవన్ కల్యాణ్, తదితర సూత్రాలను వెండితో తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు.
గ్రాము వెండిపై ఎన్టీఆర్ బొమ్మ.. స్వర్ణకారుడి అభిమానం! - విజయనగరంలో ఎన్టీఆర్ చిత్రాన్ని వెండిపై చెక్కిన స్వర్ణకారుడు
NTR photo on silver: ఈ ప్రపంచంలో దాదాపుగా అందరికీ ఎవరో ఒకరంటే అభిమానం ఉంటుంది.. ఆ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపుతుంటారు. కొందరు బహుమతుల రూపంలో తెలుపుతారు.. ఇంకొందరు తమలోని నైపుణ్యంతో అభిమానాన్ని ప్రదర్శిస్తారు. తాజాగా ప్రముఖ స్వర్ణకారుడు జగదీశ్.. దివంగత నేత ఎన్టీఆర్ చిత్రాన్ని గ్రాము వెండిపై చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు.
వెండిపై ఎన్టీఆర్ చిత్రం